సారథి, పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 122 మంది లబ్ధిదారులకు రూ.1.22 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకొండలోని తన నివాసంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,00,116 అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన మహానుభావుడని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్ధిదారులకు పారదర్శకంగా చేరవేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో సీఎం కేసీఆర్కు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, రెవెన్యూ అధికారులు, టీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- August 11, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- CM KCR
- mla challa
- PARAKALA
- ఎమ్మెల్యే చల్లా
- పరకాల
- సీఎం కేసీఆర్
- Comments Off on అందరికీ సంక్షేమ ఫలాలు