బీఆర్ఎస్ మాజీమండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డి
సామాజికసారథి,చిలప్ చెడ్: పార్టీలో గుర్తింపులేదని మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం చిలప్ చెడ్ రైతు వేదిక(శిలంపల్లి)లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ గుర్తిస్తలేదని, తెలంగాణ ఉద్యమం నుండి ఉమ్మడి కౌడిపల్లికి అధ్యక్షతగా ఉండి ఎమ్మెల్యే చిముముల మదన్ రెడ్డిని గెలిపించామని, జిల్లా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీలో కొనసాగానని, పార్టీలో గుర్తింపు లేదని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం నుండి 2001 నుండి కాంగ్రెస్, టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో, జనంతో మమేకమై కలిసికట్టుగా ఉండి గెలిపించామన్నారు. మండలంలోని ఏ కార్యక్రమమైనా పిలవడం లేదన్నారు. కించపరచడం మంచిగా లేదని, అర్హత ఉన్నా జడ్పీటీసీ టికెట్ రాలేదని, పార్టీలో గుర్తింపులేదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ముందు చెప్పుకున్నారు.
- April 13, 2023
- Archive
- మెదక్
- Comments Off on బీఆర్ఎస్ లో గుర్తింపు లేదు