Breaking News

మా భూముల్లో మొక్కలు నాటొద్దు

మా భూముల్లో మొక్కలు నాటొద్దు

సారథి, కొల్లాపూర్: నాగర్​కర్నూల్ ​జిల్లా కోడేర్ మండలం నర్సాయిపల్లి శివారులోని 30 ఎకరాల పోడు భూముల్లో ఫారెస్ట్​అధికారులు మొక్కలు నాటుతుండగా సర్పంచ్ సత్యనారాయణ యాదవ్, రైతులు, ఇతర గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దళితుల భూముల్లో మొక్కలు నాటొద్దని అడ్డుతగిలారు. సర్వేనం.357లో దళితులకు సంబంధించిన 30 ఎకరాల భూమిలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం ఏమిటని నిలదీశారు. ఫారెస్ట్ భూమి అయితే రికార్డుల్లో చూపించాలని వారు డిమాండ్ చేశారు. ‘మేము చదువుకోలేక భూముల గురించి తెలియలేదు. మాపిల్లలు చదువుకున్నారు. వారికి అంత తెలుసు. మాభూమి మాకు ఇవ్వాలి’ అని మహిళ దళిత రైతు ఆవేదన వ్యక్తం చేసింది. భూమి లేక, సొంతిండ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆక్రందన వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ చరణ్ తేజ మాట్లాడుతూ.. గతం నుంచి భూమి ఫారెస్ట్ లో ఉండటంతో మొక్కలు నాటుతున్నామని, ఏమైనా పట్టాలు ఉంటే రైతులు తీసుకురావాలని సూచించారు.

రైతుల పొలాల్లో నాటిన మొక్కలు