సామాజికసారథి, బిజినేపల్లి: పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు.. తాళం వేసిన ఇళ్లను, ఇంట్లో అందరు ఉండగానే టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. అటు ఇటు చూసి అందినకాడికి దోచుకెళ్తున్నారు. బిజినేపల్లి మండలం పాలెంలో మూడు రోజుల క్రితం జరిగిన చోరీలతో విస్తుగొల్పుతున్నాయి. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జగన్ ఇంట్లో దొంగలు పడి 3 తులాల బంగారు నగలు, రూ.20వేల నగదును ఎత్తుకెళ్లారు. అంతలోనే ఓ మాజీ ఆర్మీ జవాన్ ఇంటి తలుపులు, బీరువాను విరగ్గొట్టి రూ.50వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇక్కడ పలు విద్య, వ్యాపార సంస్థలు ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు అద్దెలకు ఉంటున్నారు. దొంగతనాలు జరుగుతున్న తీరుపై వారిలో కొంత భయాందోళన ఉంది. అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ పెట్రోలింగ్ కూడా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
- June 13, 2024
- Top News
- Comments Off on పాలెంలో పట్టపగలే చోరీలు