సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: బహుజనులంతా ఏకమై, రాజ్యాధికారం దిశగా పయనించాలని బీఎస్పీ నల్లగొండ మండల కన్వీనర్ దున్న లింగస్వామి అన్నారు. సోమవారం నల్లగొండ మండలం బుద్ధారం గ్రామంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. నెల 23న బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి, బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పారు. కార్యక్రమంలో నల్లగొండ సెక్టార్ కార్యదర్శులు పులిగిల్ల మహేష్, బకరం శశికాంత్ బుద్ధారం గ్రామ శాఖ అధ్యక్షులు చర్లపల్లి నవీన్ కుమార్ రజక, బూత్ కమిటీ మెంబర్స్ బకరం బెన్ రాజు, బకరం సాయి, బకరం ధనుంజయ్, దున్న సాయి, అఖిల్ పొడపంగి పప్పీ, తదితరులు పాల్గొన్నారు.
- November 23, 2021
- Top News
- BAHUJANA
- galam
- NALLAGONDA
- vinipinchali
- గళం
- నల్లగొండ
- బహుజన
- వినిపించాలి
- Comments Off on బహుజన గళం వినిపించాలి