Breaking News

కేఎంపీఎల్ పెంపుతోనే ఆర్టీసీకి మనుగడ

కేఎంపీఎల్ పెంపుతోనే సంస్థకు మనుగడ

సారథి న్యూస్, కల్వకుర్తి: ఇంధన పొదుపుతోనే ఆర్టీసీ సంస్థ మనుగడ సాధిస్తుందని, కార్పొరేషన్​ అభివృద్ధికి ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆర్టీసీ డివిజినల్ మేనేజర్ ఉషాదేవి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి డిపోలోని డీఎం సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ‘జాతీయ రోడ్డుభద్రతా మాసోత్సవాలు, ఇంధన సంరక్షణ క్షమత’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్వకుర్తి డిపోను ప్రమాదరహిత డిపోగా మార్చాలన్నారు. అనంతరం యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లు అరుణ్ కుమార్, అంజయ్య, మైనోద్దీన్ కు క్యాష్ అవార్డు అందజేశారు. కార్యక్రమంలో ఎంవీఐ రాంబాబు, సీఐ సైదులు యాదవ్ ఎంఎఫ్ శ్రీకాంత్, ట్రాఫిక్ సీఐ ఆనందరావు, ఆర్టీసీ ఉద్యోగులు, గ్యారేజీ సిబ్బంది పాల్గొన్నారు.