సారథి, చొప్పదండి: సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిజాం సర్కార్తరహాలో పాలన కొనసాగిస్తోందని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్యాయాలు, అక్రమాల మీద ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు దోపిడీ, అన్యాయం, బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.
- August 1, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- balmuri venkat
- congess
- nsui
- ఎన్ఎస్ యూఐ
- కాంగ్రెస్
- చొప్పదండి
- Comments Off on ‘బెదిరింపులతో పాలన సాగించలేరు’