సామాజిక సారథి, హుస్నాబాద్: 41 ఏండ్ల తర్వాత ఒక్కటైన ఆత్మీయ పూర్వ విద్యార్థులు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1979- 1980లో ఎస్ఎస్ఎసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు దశాబ్ధాల తర్వాత విద్యాభ్యాసం నుండి విద్యను బోధించిన గురువులను ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటూ, చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమరుసుకున్నారు. అనంతరం అప్పటి జ్ఞాపకాలతో ఓ పుస్తకాన్ని ముద్రించి, గురువులకు, వారు చదువుకున్న హుస్నాబాద్ ప్రభుత్వ (బాలుర) పాఠశాలకు అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో నాటి గురువులు వెంకట్ రెడ్డి, వీరసోమయ్య, చంద్రయ్య, వరియోగుల తిరుమలయ్య, సుదర్శన్, బండారి మనీలా గురువులతో తీపి జ్ఞాపకాలను పంచుకొని రోజంతా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాంచంద్రారెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, జితేందర్, పద్మలత, సుజాత, చిత్తారి హన్మయ్య, నరేందర్ తో పాటు మరో 50మంది ఆత్మీయులు కుటుంబ మేతంగా పాల్గొన్నారు.
- November 21, 2021
- Top News
- 41
- Atmiya
- Bandham
- HUSNABAD
- old students
- SIDDIPET
- Years
- ఆత్మీయ
- ఏండ్లు
- ఓల్డ్ స్టూడెంట్స్
- బంధం
- సిద్దిపేట్
- హుస్నాబాద్
- Comments Off on 41 ఏండ్ల తర్వాత ఒక్కటైన ఆత్మీయ బంధం