సారథి, నల్లగొండ : కరోనా రెండోదశ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని లేకపోతే జరిమానాలు తప్పవని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ట్రాఫిక్ సీఐ దుబ్బ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్ లో మాస్కుల ప్రాధాన్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా వెళ్తున్న పలువురికి డీఎస్పీ స్వయంగా మాస్కులు తొడిగారు. కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీఐజీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు నల్లగొండ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమని చెప్పారు. మాస్కులు ధరించని వారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ కుమార్ తో పాటు ట్రాఫిక్ ఎస్సై జయానందం, ఏఎస్సై సుధాకర్, మహేందర్, జహంగీర్ పాల్గొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఫైన్
మద్యం సేవించి వాహనాలు నడిపిన 9మందికి జరిమానా గురువారం రెండవ తరగతి న్యాయమూర్తి ఎదుట కోర్టులో హాజరుపర్చగా, ఒక్కొక్కరికి రూ.2,000చొప్పున, రూ.18,000 జరిమానా వేసినట్లు ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ తెలిపారు.
- April 2, 2021
- Archive
- carona second wave
- dranken drive
- NALGONDA
- కరోనా సెకండ్ వేవ్
- డ్రంకెన్ డ్రైవ్
- నల్లగొండ
- Comments Off on మాస్కు లేకపోతే ఫైన్ తప్పదు