Breaking News

ఆవిరైపోతున్న రైతుల ఆశలు

ఆవిరైపోతున్న రైతుల ఆశలు

సామాజిక సారథి డిండి: గత పదిరోజులగా కురుస్తున్న అకాల వర్షాలకు చేతికొచ్చిన వరి పంటలు తడిచిపోయి పంట పొలంలోనే మొలకెత్తాయి. వివరాల్లోకి వెళితే డిండి మండలం ప్రతాప్ నగర్ గ్రామానికి చెందిన తోటపల్లి మల్లేష్ అను యువకుడు బీఎడ్ పూర్తి చేసిండు. ఉన్నత చదువులు చదివిన ఏలాంటి ఉద్యోగం రాకపోవడంతో తనకున్న మూడెకరాల వ్యవసాయ పొలంలో వరిసాగు చేశాడన్నారు. దీంతో చేతికొచ్చిన పంట పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఆ యువరైతతు కన్నీటి పర్యంతమయ్యాడు. సమీపంలోని 100 ఎకరాల్లో పంట నష్టం జరగడంతో రైతులు ఆందోళన చేందుతున్నారు. ఇప్పటికై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.