సారథి, గొల్లపల్లి: తెలంగాణ సాయుధ పోరాటవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎంపీపీ ఆవుల సత్యం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబుల దురాగతాలు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా భీకరమైన సాయుధ పోరాటంలో తెలంగాణ గడ్డపై ఒరిగారని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు బొల్లం రమేష్, ఉపసర్పంచ్ మారం శేఖర్, కచ్చు కొమురయ్య, ధనుంజయ, సతీష్, తిరుపతి, రాజశేఖర్, చందు తిరుపతి, సుదర్శన్, అంకం భూమయ్య, రాజయ్య పాల్గొన్నారు.
- July 4, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- doddi komurayya
- NIZAM NAWAB
- తెలంగాణ సాయుధ పోరాటం
- దొడ్డి కొమురయ్య
- నిజాం నవాబు
- Comments Off on దొడ్డి కొమురయ్య పోరాటం చిరస్మరణీయం