Breaking News

పల్లె పులకించేలా ప్రగతి

పల్లె పులకించేలా ప్రగతి

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

సారథి, రామాయంపేట: పల్లె ప్రకృతి పులకించేలా, పల్లెజనం ఆరోగ్యంగా ఉండేలా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మక చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలను నాటడమే కాదు.. వాటిని బాధ్యతగా పెంచి కాపాడాలని సూచించారు. సోమవారం మెదక్ ​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో 53 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చల్మేడ గ్రామంలో మొక్కలు నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్కట తొట్టెల తొట్టెలకు పెళ్లిళ్లు చేసేవారని ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందన్నారు. ఆడ పిల్లల పెళ్లికి ఇబ్బందులు రాకుండా సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మీ కింద నేడు రూ.1,16,​00​0 ఇస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గిపోయాయని వివరించారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్ కుమార్, ఎంపీపీ, నిజాంపేట సర్పంచ్ అనూష, ఎంపీటీసీ సభ్యురాలు లహరి, తహసీల్దార్ జయరాం, అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు పాల్గొన్నారు.