ఎమ్మెల్సీ తనయుడు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని కార్యకర్తల ప్రేమానురాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ పట్టణంలో ఆయన కార్యకర్తల ఇంటికి వెళ్లి కొంతసేపు గడిపారు. సీనియర్ కార్యకర్త హసన్ ఇంటిలో టిఫిన్ చేసి పట్టణంలోని కొందరు కార్యకర్తల అభిప్రాయం మేరకు వారి ఇంటికి వెళ్లి విస్తృతంగా పట్టణంలో కలియతిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 30 ఏళ్ల నుంచి అమ్మ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ఇక్కడి కార్యకర్తల ప్రేమానురాగాలతోనే త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్తానని తెలిపారు. నమ్ముకున్న కార్యకర్తలకు తన తండ్రితో పాటు తాను కూడా ఎల్లవేళలా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆయన వెంట సీనియర్ నాయకులు రమణరావు , బలరామ్, హరిబాబు, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
My favourite 😍