Breaking News

వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు

వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు

ఈ రోజు రాశిఫలాలు
23 ఏప్రిల్ 2021
వారం: శుక్రవారం, చైత్రమాసం

ప్లవనామ ఉత్తరాయణం, వసంతరుతువు, శుక్ల పక్షం
సూర్యోదయం: 5:45,
సూర్యాస్తమయం : 6:12
తిథి: ఏకాదశి సాయంత్రం: 5.25
రాహుకాలం: ఉదయం: 10.30 నుంచి 12.00
యమగండం: పగలు: 3.00 నుంచి 4.30
వర్జ్యం: ఉదయం: 11.16 నుంచి 12.49
దుర్ముహుర్తం: ఉదయం 8.24 నుంచి 9.12, పగలు 12.24 నుంచి 1.12

మేషం: ఆర్థికంగా బాగా స్థిరపడతారు. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు ప్రణాళికలు చేపడుతారు. స్త్రీలు ఆహార విషయంలో వేళ తప్పి భోజనం చేయడం ద్వారా ఆరోగ్యం సమస్యలు తలెత్తుతాయి. సౌకర్యాలకు ఇబ్బంది లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించకపోవడం మంచిది. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి.

వృషభం: పెద్దల ఆరోగ్యం కోసం ధన విరివిగా వ్యయం చేస్తారు. రిప్రజెంటేటివ్‌లు, పత్రికా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పెద్దల నుంచి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది.

మిథునం: బ్యాంకు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. మీ చిన్నారుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి కలుగుతుంది. స్థిరచరాస్తుల విక్రయంలో పునరాలోచన మంచిది. సంఘంలో మీ మాటకు మంచి పేరు,ఖ్యాతి లభిస్తుంది. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.

కర్కాటకం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దూర ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది. కుటుంబమున చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనుల్లో సమయానికి పూర్తికావు నిరుత్సాహం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు. వాహన ప్రయాణాల్లో ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా నష్టాలు ఉంటాయి. ఉద్యోగంలో చేయని పనికి అధికారుల నుంచి నిందలు పడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిదికాదు. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాల్లో వారికి అనుకూలమైన కాలం. ఇంటాబయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు.

సింహం: నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాలు చికాకు పెరుగుతాయి. కొంత మొత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. మిత్రులతో సంభాషించడం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.

కన్య: గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ధనసహాయం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించండంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాహనం వీలైనంత నిదానంగా నడపడం మంచిది. పనికిమాలిన నూతన పరిచయాలేర్పడతాయి.

తుల: ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మానసిక సమస్యలు అధికమవుతాయి. అవసరానికి డబ్బు లభించక ఇబ్బందిపడతారు. అంతగా పరిచయంలేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఉద్యోగంలో శత్రుసంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు.

వృశ్చికం: స్త్రీలకు ఇరుగు, పొరుగువారితో సఖ్యత అంతగా ఉండదు. ప్రముఖులను కలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతాన విద్యావిషయాలు అనుకూలంగా ఉండవు. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు.

ధనుస్సు: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువుల రాకతో ఇంటిలో సందడి నెలకొంటుంది. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది.అనారోగ్య సమస్య బాధిస్తాయి. ఇతరుల వలన విరోధం పెరుగుతుంది. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. సంతాన విద్యా సంబంధిత విషయాల్లో సమస్యలు కలుగుతాయి. మీరు దేనని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. రుణాలు తీరుస్తారు.

మకరం: వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో ఊహించని అవకాశాలు వస్తాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు పొందుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో పెద్దల ఆదరణ పొందుతారు. ​ప్రతి పని చేతిదాగా వచ్చి వెనక్కిపోవడం వల్ల ఆందోళన కలుగుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది.

కుంభం: ఆర్థిక సమస్యలు ద్వారా ఆందోళన చెందుతారు. భవిష్యత్ ప్రణాళికల గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. విలువైన వస్తువులు పొగొట్టుకుందురు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని వైపులా నుంచి ధనలాభం అందుతుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. స్త్రీలకు ఆహార, ఆరోగ్యంలో జాగ్రత్తలు అవసరం. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం నుంచి ఉపశమనం పొందుతారు.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. రాజకీయాల్లోని వారికి ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇంటాబయట నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు.

:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్​ విశ్మకర్మ గురూజీ
ప్రముఖ జ్యోతిష్య పండితులు
సెల్​ నం.95020 59649