హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు ఎక్కడెక్కడ ఎన్ని స్థలాలు ఉన్నాయో జిల్లాలవారీగా వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఎన్ని స్థలాలు కబ్జాకు గురయ్యాయో, ఆక్రమణలు జరిగాయో, నిర్మాణాలు చోటుచేసుకున్నాయో జూన్ 10వ తేదీ వరకు వివరాలు సమర్పించాలని సూచించింది. వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను బెంచ్ గురువారం విచారించింది. వక్ఫ్ బోర్డు తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 2,186 వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటైందా? అందులో ఎంతమంది ఉన్నారు? అది సాధించిన ప్రగతి ఏమిటి? ఎన్ని ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది? తదితర వివరాలేలు వక్ఫ్ బోర్డు వద్ద లేకపోవడంపై బెంచ్ అసహనం వ్యక్తంచేసింది. ఈ వివరాలను జిల్లాలవారీగా పూర్తిగా నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించింది.
- March 26, 2021
- Archive
- HIGHCOURT
- TASKFORCE
- telangana woqf lands
- తెలంగాణ
- వక్ఫ్ బోర్డు
- హైకోర్టు
- Comments Off on వక్ఫ్ బోర్డు ఆస్తుల లెక్క చెప్పండి