Breaking News

విద్యార్థుల వద్దకే టీచర్లు

విద్యార్థుల వద్దకే టీచర్లు

సారథి న్యూస్, రామడుగు: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా కారణంగా విద్యావ్యవస్థ సమూలంగా దెబ్బతిన్నది. దీంతో విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారింది. ఈ తరుణంలో పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు హోమ్ ట్యూషన్ ను ఆశ్రయిస్తున్నారు. అందులో భాగంగానే రామడుగు మండల కేంద్రంలో పిల్లలను హోమ్ ట్యూషన్ పంపించే క్రమంలో రోడ్డు దాటించడం ఇబ్బందిగా మారడం, సరైన సమయంలో పేరెంట్స్​ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల వద్దకే ఉపాధ్యాయులు స్వయంగా వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. ఈ క్రమంలో చొప్పదండి మండల కేంద్రంలో స్థానిక ముదిరాజ్ సంఘంలో ఉపాధ్యాయిని సంధ్య కరోనా నిబంధనలు పాటిస్తూ 15 రోజులుగా నర్సరీ నుంచి 5 తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతూ అందరి చేత శభాష్​ అనిపించుకుంటున్నారు.