సారథి న్యూస్, రామాయంపేట: ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్, జయంతి ఘోష్ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా కమిటీ సభ్యులు దుబాసి సంజీవ్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో 60శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఏడాది కాలంగా కరోనా మహమ్మారితో రైతులు ఇబ్బందిపడుతున్నారని వివరించారు. వారిని ఆదుకోవాలని కోరారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో శతాబ్ది మహాసభ సందర్భంగా సరస్వతి కాన్వెంట్ హైస్కూల్లో మహాసభను నిర్వహించనున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా నలుమూలల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో శంకర్, శ్రీనివాస్, రాజు, రైతులు పాల్గొన్నారు.
- March 5, 2021
- Top News
- JAYATHIGOSH
- MS SWAMY NATHAN
- RYTHU SWARAJYA VEDIKA
- ఎంఎస్ స్వామినాథన్
- జయతిఘోష్
- రైతు స్వరాజ్య వేదిక
- Comments Off on స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి