సామాజికసారథి, బిజినేపల్లి: మూగ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ సోషల్ ఉపాధ్యాయుడు మాసయ్యను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, విధుల నుండి శుక్రవారం సస్పెన్షన్ చేసినట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు.బిజినేపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాసయ్య మూగ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా సోషల్ ఉపాధ్యాయుడిని, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్ చేసినట్లు డీఈఓ గోవిందరాజులు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
- April 19, 2024
- Top News
- Comments Off on యువతి పట్ల సభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్