సారథి, వేములవాడ: వేములవాడ పట్టణంలోని గౌతమ్ మాడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభచాటారు. ఇటీవల గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగిన ట్రెడిషనల్ యూత్ గేమ్స్ అండర్-19 హెవీ వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, కబడ్డీ పోటీల్లో లలిత, విజయ్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. శివసాయి, గణేశ్ కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా వారు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను కలిశారు. ఆయన ఆ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్నిరంగాల్లోనూ ముందుండాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని కోరారు. పాఠశాల కరస్పాండెట్ బుర ఉమారమేష్, ప్రిన్సిపల్ తాటికొండ రమేశ్, పీఈటీ శివ విద్యార్థులను అభినందించారు.
- August 3, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Rajanna
- vemulawada youth games
- యూత్గేమ్స్
- రాజన్న సిరిసిల్ల
- వేములవాడ
- Comments Off on విద్యార్థులు అన్నిరంగాల్లోనూ రాణించాలి