సారథి న్యూస్, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో గురువారం ఎస్బీఐ కస్టమర్సర్వీస్ పాయింట్(మినీ బ్యాంకు)ను కల్వకుర్తి బ్రాంచ్ మేనేజర్ శివశ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊరులోనే నగదు పొందే సదుపాయాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖాతాదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్రావు, బీజేపీ నాయకుడు జూలూరి బాలస్వామి, వార్డు సభ్యులు కొప్పు హరిశ్చంద్రప్రసాద్, పొనుగోటి విష్ణువర్ధన్రావు, నిర్వాహకులు సిద్ధు, రాము, రవి, శ్రీను, గణేష్, లక్ష్మణ్, జి.నిరంజన్, ఎన్.శ్రీనివాసులు, ఎం.లాలుప్రసాద్ పాల్గొన్నారు.
- February 25, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- Comments Off on కొట్రలో మినీబ్యాంకు ప్రారంభం