సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం, వరంగల్లు, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్‌కుమార్)బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసు, ప్రభుత్వ ఆస్పత్రి, జడ్పీ హైస్కూలు, కస్తూర్బా విద్యాలయం, మినీ గురుకులంలో విధులు నిర్వహిస్తున్న పట్టభద్రులను కలిశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు ఒకసారి అవకాశమిస్తే భావితరాలకు భరోసాగా నిలుస్తానని, ప్రశ్నించే గొంతుకగా, ప్రజలపక్షాల నిలబడతానని అన్నారు. అంతకుముందు తీన్మార్ మల్లన్న ఏటూరునాగారంలోని విద్యావంతులను కలిశారు. కార్యక్రమంలో ములుగు జిల్లా ఇన్చార్జ్ అచ్చు నూరికిషన్, వాజేడు, వెంకటాపురం మండలాల ఇన్చార్జ్ పాయం అజయ్, దిలీప్, పార్దు, పాపారావు, జనగం ప్రసాద్, సూరిబాబు, రజినీకాంత్, సాయితేజ, శశిధర్, శివాజీ పాల్గొన్నారు.
- January 27, 2021
- Archive
- పొలిటికల్
- MLC ELECTIONS
- NALGONDA
- TEENMAR MALLANNA
- WARANGAL
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఏటూరు నాగారం
- తీన్మార్ మల్లన్న
- Comments Off on ప్రశ్నించే గొంతుకగా నిలుస్తా: తీన్మార్ మల్లన్న