సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టిందని ఎంఈవో పోచయ్య అన్నారు. శనివారం ఆయన మండలంలోని పలు ప్రభుత్వ స్కూళ్లను తనిఖీచేసి హెడ్ మాస్టర్లు ఆన్ లైన్ లో నమోదు చేసిన వివరాలను సరిచూశారు. స్థానిక బాలికల ప్రాథమిక పాఠశాల, బాలుర ప్రాథమిక పాఠశాలతో పాటు పలు స్కూళ్లను తనిఖీచేశారు. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు కూడా తమ పరిధిలోని స్కూళ్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు పోమ్యనాయక్, సుజాత, విజయ్ కుమార్, కేవీ రవీందర్, రామచంద్రాచారి, మారుతి పాల్గొన్నారు.
- April 5, 2021
- Archive
- PEDDASHANKARAMPET
- school complex
- SPECIAL DRIVE
- పెద్దశంకరంపేట
- స్కూలు కాంప్లెక్స్
- స్పెషల్ డ్రైవ్
- Comments Off on మౌలిక సదుపాయాల కల్పనకు స్పెషల్ డ్రైవ్