హైదరాబాద్: మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ తనయుడు మహమ్మద్ అసదుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియామీర్జా సోదరి ఆనంమీర్జాతో కలిసి శుక్రవారం లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. షర్మిల నూతన పార్టీ ప్రకటన నేపథ్యంలో సెలబ్రెటీలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నేపథ్యంలో షర్మిల ఆ జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో సమీక్షించారు. భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. ఈ సభ కోసం షర్మిల కోఆర్డినేషన్ కమిటీ వేశారు. ఖమ్మం జిల్లా నుంచి సుమారు 100 మంది తరలివచ్చి తమ ప్రాంత సమస్యలను షర్మిలకు వివరించారు. వైఎస్సార్ తమ ప్రాంతానికి ఎంతో చేశారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు పట్టించుకోవడంలేదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పోడు భూముల విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు పేర్కొన్నారు. అందుకు ఆమె భరోసా ఇచ్చారు.
- March 20, 2021
- Archive
- AZAHARUDDIN
- SANIAMIRZA
- SHARMILA
- YSR
- అజహరుద్దీన్
- ఆనంమీర్జా
- వైఎస్సార్
- షర్మిల
- సానియామీర్జా
- Comments Off on షర్మిలను కలిసిన అజహరుద్దీన్ కొడుకు