సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో శనివారం ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు రాథోడ్ (25) ప్రమాదస్థలంలోనే మృతిచెందారు. స్థానికుల కథనం.. శనివారం మధ్యాహ్నం రెండో షిఫ్ట్ లో బ్లాస్టింగ్ అనంతరం వాహనాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్రేడర్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రాంతం కాని ప్రాంతం నుంచి ఉపాధి కోసం వచ్చిన యువకుడు ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో రామకృష్ణాపూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.
- June 18, 2022
- Top News
- GUJARATH
- OPENCOAST
- RAMAKRISHNA
- ఓపెన్ కాస్ట్
- గుజరాత్
- రామకృష్ణాపూర్
- Comments Off on గ్రేడర్ తగిలి కార్మికుడి మృతి