సారథి, ఖమ్మం: భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల సంకల్ప సభ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి తల్లి విజయమ్మతో కలసి షర్మిల భారీ కాన్వాయ్ ఖమ్మం బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకుంటారు.
షర్మిల తల్లి విజయమ్మ ఆశీర్వాదం తసుకున్న తర్వాత సభను ప్రారంభించనున్నారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఓ వైపు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అమలుచేసిన ప్రజాసంక్షేమ పథకాలను వివరిస్తూ.. మరోవైపు టీఆర్ఎస్ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగడుతున్న వైఎస్షర్మిల తాజాగా సంకల్ప సభ’లో ఏం మాట్లాడతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభలోనే పార్టీ జెండా, ఎజెండాను వైఎస్ షర్మిల ఖరారుచేసే అవకాశం ఉంది.