సారథి ప్రతినిధి, జగిత్యాల: ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత స్ఫూర్తితో తాము కూడా
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు యెన్నం కిషన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి పొన్నం లావణ్య తెలిపారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలో పలువురికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, లావణ్య మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచులకు ఎల్ఎం ట్రస్ట్ పక్షాన పెళ్లిళ్లు చేయడం, కుట్టుమిషన్లు అందించడం, వైద్యశిబిరాలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలతో కొప్పుల స్నేహలత నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు స్వీయరక్షణతో ఉండి కాపాడుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, మాన్యం రవికుమార్, పెండెం మహేందర్, వేణు, లక్ష్మణ్, చారి, నాగేందర్, శ్రీనివాస్, శశిధర్, మోహన్ పాల్గొన్నారు.
- June 18, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DHARMAPURI
- JAGITYALA
- koppula snehaltha
- కొప్పుల స్నేహలత
- జగిత్యాల
- ధర్మపురి
- Comments Off on కొప్పుల స్నేహలత స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు