Breaking News

పారదర్శకంగా ’డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

పారదర్శకంగా ’డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సామాజిక సారథి, హైదరాబాద్‌: పేదల కోసం నిర్మించి ఇస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. సోమవారం సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ చాచా నెహ్రూనగర్‌లో నిర్మించిన 264 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పంపిణీ చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేకబస్తీ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా బస్తీ ప్రజల అందరి సమక్షంలోనే అర్హులను గుర్తించి ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కలెక్టర్‌ శర్మన్‌ల సమక్షంలో అధికారులు లబ్ధిదారులను ఒక్కొక్కరిగా పేర్లతో పిలిచి ఇతను మీ బస్తీ వాసేనా అని స్థానిక ప్రజలను అడిగి అర్హుడిగా నిర్ధారణ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ హేమలత, సికింద్రాబాద్‌ ఆర్డీవో వసంతకుమారి, తహసీల్దార్‌ బాలశంకర్‌, హౌసింగ్‌ ఈఈ వెంకట్‌దాస్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు జి.పవన్‌కుమార్‌గౌడ్‌, కె.లక్ష్మిపతి, బస్తీ అధ్యక్షుడు అచ్చా నర్సింగ్‌రావు, డి.సుదర్శన్‌బాబు, వై.సురేష్​కుమార్‌, విజయ్‌శంకర్‌, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.