సారథి, ఎల్ బీ నగర్: శ్రీసాయి శాంతి సహాయ సేవాసమితి ఆధ్వర్యంలో లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో వనస్థలిపురం గణేశ్ టెంపుల్ లో ఆదివారం పలువురికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాసవి బిజినెస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ యేర్రం విజయ్ కుమార్ సతీమణి యెర్రం వనిత నిత్యావసర సరుకులు, రోబోటచ్ సంస్థ అధినేత యెర్రం బాలకృష్ణ సతీమణి ఉమాలక్ష్మి మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. ముఖ్యఅతిథులుగా వనస్థలిపురం సీఐ మురళి మోహన్, స్ఫూర్తిసేవాసంస్థ అధ్యక్షుడు కొలిశెట్టి సంజయ్ కుమార్ హాజరయ్యారు. నిరుపేదల ఆకలి తీర్చడం గొప్ప కార్యమన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ యెర్రం పూర్ణశాంతి గుప్తా మాట్లాడుతూ.. నిరంతరం సేవచేసేందుకు దాతలు ముందుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లాలన మాధవి, సభ్యులు పాల్గొన్నారు.
- June 6, 2021
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- lalana walfare
- robotouch
- vasavi group
- రోబోటచ్
- లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్
- వాసవి గ్రూప్
- శాంతి సహాయ సేవాసమితి
- Comments Off on నిరుపేదల ఆకలి తీర్చడం గొప్పకార్యం