Breaking News

ఆకలి తీరుస్తూ.. ఆభయమిస్తూ!

ఆకలి తీరుస్తూ.. ఆభయమిస్తూ!


  • ఓ అనాథ వృద్ధుడికి అన్నం తినిపించి..
  • మానవత్వం చాటిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్

సారథి న్యూస్, ములుగు: పేదల ఆకలి తీరుస్తున్నారు.. అభాగ్యులకు నేనున్నామని అభయమిస్తున్నారు ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ఆకలితో అలమటిస్తున్న ఓ అనాథ వృద్ధుడికి తన స్వహస్తాలతో అన్నం తినిపించి మానవత్వం చాటుకున్నారు. తస్లీమా ఉద్యోగరీత్యా బుధవారం ఉదయం హన్మకొండ నుంచి ములుగు వస్తున్న క్రమంలో మల్లంపల్లి సమీపంలో ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు పక్కన ఓ అనాథ వృద్ధుడు ఆకలికి తాళలేక ఎంగిలి విస్తరి ఆకులు తింటూ కనిపించాడు. బస్సులో ఉన్న ఆమె ఇది గమనించి చలించిపోయారు. తన వెంట తెచ్చుకున్న లంచ్ బాక్స్​ను అతనికి తినిపించారు. ఆకలితో అలమటిస్తూ ఎవరు కనిపించినా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా బుక్కెడు అన్నం పెట్టాలని కోరారు. ఇతరుల ఆకలిని తీర్చడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదన్నారు. సామాజిక సేవలో పాలుపంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.