సారథి, చొప్పదండి: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు నియోజకవర్గ దళితులపై చిత్తశుద్ధి, గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, దళితబంధు పథకాన్ని ఇక్కడ కూడా అమలుచేసేలా రాష్ట్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎస్సీసెల్ చొప్పదండి పట్టణాధ్యక్షుడు కనుమల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం ఆయన చొప్పదండిలో విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద కేవలం హుజూరాబాద్ లో మాత్రమే అమలు చేస్తామని చెప్పడం, రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లోని దళితులందరినీ ప్రభుత్వం నిరాశకు గురిచేసిందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్చేశారు. 2021 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు అందరికీ యూనిట్లు మంజూరయ్యేలా చూడాలని కోరారు.
- August 4, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CHOPPADANDI
- MLA SUNKE
- RYTHUBANDU
- ఎమ్మెల్యే సుంకే
- చొప్పదండి
- రైతుబంధు
- Comments Off on రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలుచేయాలి