Breaking News

పెద్దమొత్తంలో నగదు సాయం మంచిదికాదు

పెద్దమొత్తంలో నగదు సాయం మంచిదికాదు


18 ఏప్రిల్ 2021

వారం: ఆదివారం
తిథి: షష్టి సా. 5.47
నక్షత్రం: ఆరుద్ర రాత్రి 12.45
రాహుకాలం: సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: పగలు 12.00 నుంచి 1.30 వరకు
వర్జ్యం: ఉదయం 8.20 నుంచి 10.04 వరకు
దుర్ముహుర్తం: సాయంత్రం 4.25 నుంచి 5.13 వరకు

మేషం: ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ధన వ్యవహారాల్లో ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. బాకీలు, ఇతరాత్ర రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, ఎక్స్‌పోర్టు రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృషభం: ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ ఫైనాన్స్​ల్లో మదుపు క్షేమం కాదు. సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి, ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. దైవ, సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు.

మిథునం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చిన్నారులు, ఆత్మయులకు కానుకలు చదవించుకుంటారు. నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసారిస్తారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనల నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులు మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, లీజు పొడగింపులు, టెండర్లు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం: మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో స్థిరాస్తి తగాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో శిరోబాధలు తప్పవు. వ్యాపారాలు స్వల్పంగా లాభం చేకూరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది. బంగారు, వెండి వ్యాపారులకు లాభదాయకం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.

సింహం: ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకేస్తారు. కొన్ని బంధాలను నిలుపుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. పాతమిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. భూ క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోగతి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. మీ ప్రియమైన వారి రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తి కలిగిస్తుంది.

కన్య: వృత్తులవారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. దుబారా ఖర్చులు అధికం. కొన్ని విషయాలు పట్టించుకోకపోవడం ఉత్తమం. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.వృధా ప్రయాణాలుచేస్తారు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతోఅనుకోని కలహాలు కలుగుతాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది.

తుల: సంప్రదింపులు, ఒప్పందాలతో హడావుడిగా ఉంటారు. సంతానం ఉన్నత విద్యలపై దృష్టిసారిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఇంటిలో శుభకార్యం ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు చాలా అవసరం. పెద్దమొత్తంలో నగదు సాయం మంచిదికాదు. వ్యాపారుల్లో కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కొంటారు.

వృశ్చికం: మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియజేయండి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. స్త్రీలకు నూతన పరిచయాలు, చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి.

ధనుస్సు: అధికారాలు, ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విజ్ఞతతో మీ అత్మాభిమానం కాపాడుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.

మకరం: వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందితో సంయమనంతో నడుకోవాల్సి ఉంటుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం క్షేమంకాదు.

కుంభం: గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుగ్గా సాగుతాయి. భాగస్వామిక ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించండి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి. ఖర్చులు అదుపు చేయడం అవసరం. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడడం మంచిది.

మీనం: ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచివికాదని గమనించండి. పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగుల అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది. వ్యాపారాభివృద్ధికి కృషిలో రాణిస్తారు. ఉద్యోగస్తులపై పనిభారం. అధిక ఒత్తిడి ఉంటుంది. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ, మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.

:: బ్రహ్మశ్రీ మహేష్ విశ్వకర్మ గురూజీ
జ్యోతిష్య పండితులు
సెల్​ నం.95020 59649