సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు నాగర్ కర్నూల్ లోని వారి స్వగ్రామం తూడుకుర్తిలో ఘనంగా నిర్వహించారు. ‘రాజేష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ కార్యకర్తలు కేక్ లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజినేపల్లి సహకార సంఘం మాజీ చైర్మన్ వెంకటస్వామి, నాగర్ కర్నూల్ కౌన్సిలర్ శ్రీనివాసులు మాట్లాడుతూ త్వరలోనే నాగర్ కర్నూల్ కు పూర్వవైభవం రానుందని, నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ప్రతి గ్రామంలో యువత డాక్టర్ రాజేష్ రెడ్డి నాయకత్వం కోసం ఎదురుచూస్తోందని, అలాంటి రోజు అతిత్వరలోనే నెరవేరుతుందన్నారు. నాగర్ కర్నూల్ అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, త్వరలోనే ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయని విశ్వాసం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, తిరుపతయ్య, అమృత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
కేక్ కట్ చేసి తినిపించుకుంటున్న రాజేష్ రెడ్డి అభిమానులు, నేతలు