సామాజికసారథి, బిజినేపల్లి: తెలంగాణ డెంటల్డాక్టర్స్ అసోసియేషన్రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి మంగళవారం యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. సకాలంలో వర్షాలు కురిసి.. పాడిపంటలు కలగాలని.. కరోనా పీడ పూర్తిగా తొలగాలని.. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. రాజేశ్‌రెడ్డి వెంట పలువురు కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నారు.
- May 17, 2022
- Top News
- kuchakulla
- YADADRI
- కూచకుళ్ల
- యాదాద్రి
- Comments Off on యాదాద్రి సన్నిధిలో..