Breaking News

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సారథి ప్రతినిధి, జగిత్యాల: ఏఐసీసీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ సంయుక్తంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు స్థానిక ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక సివిల్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ అల్లాల రమేష్ రావు జన్మదిన వేడుకలను కూడా జరుపుకున్నారు. కార్యక్రమంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బండ శంకర్, గిరి నాగభూషణం, బండ భాస్కర్ రెడ్డి, దుర్గయ్య, గాజుల రాజేందర్, రమేష్ రావు, నక్క జీవన్, చందు భాయ్, గంగాధర్, శేఖర్, నేహల్, భూంరెడ్డి, గుండా మధు, బాపురెడ్డి, రియాజ్, రాజు, సీసీ, మధు, కిషోర్, రాజశేఖర్, శేఖర్, హరీశ్, భార్గవ్, మాన్విత్, సాకేత్, వినయ్, ప్రశాంత్, రిషి, సాయి పాల్గొన్నారు.