Breaking News

ఆ రాశివారు నోరు అదుపులో ఉంచుకుంటే మంచిది

ఆ రాశివారు నోరు అదుపులో ఉంచుకుంటే మంచిది

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి శు.పంచమి సా.4.30 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం మృగశిర రా.10.50 వరకు తదుపరి ఆరుద్ర, వర్జ్యం… లేదు, దుర్ముహూర్తం ఉ.5.48 నుండి 7.25 వరకు, అమృతఘడియలు… ప.1.11 నుంచి 2.56 వరకు, శ్రీపంచమి.

సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
నేటి రాశిఫలాలు (17 ఏప్రిల్ 2021)

మేషం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ఒడిదుడుకులు నుంచి బయటపడతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇతరులకు పెద్దమొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది.

వృషభం: ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాలవారికి ఒత్తిడి అధికం. సోదరీ, సోదరుల మధ్య ఏకాగ్రతాలోపం అధికం అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదురై చికాకుపెట్టినా అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. బంధువులతో మాటపట్టింపులు తొలగిపోతాయి. స్త్రీలకు అలంకారాలు, విలువైన వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కొత్త షేర్ల కొనుగోళ్లలో పునరాలోచన అవసరం. రుణం పూర్తిగా తీర్చి తాకట్లు విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చుట్టుముడుతాయి.

మిథునం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులు అధికారుల వల్ల సమస్యలు తలెత్తినా బంధువుల సహకారం వల్ల సమసిపోతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక విమర్శలు ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. రాజకీయ నాయకులకు మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి.

కర్కాటకం: ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి, క్రయ విక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తిచేస్తారు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పొందుతారు. మీ వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పకండి. వాహనం నడిపేటప్పుడు మెళకువ, ఏకాగ్రత ఉండాలి. స్త్రీలతో మితంగా సంభాషించండి.

సింహం: విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు నిశ్చింత కలిగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులు ఉండవు. బంధుమిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. అవసరాలకు డబ్బు చేతికందుతుంది. ప్రారంభించిన వ్యవహారాలను సకాలంలో పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులు ఉన్నత పదోన్నతులు పొందుతారు. ఇతరులకు ధనవిషయాలో మాట ఇచ్చేముందు పునరాలోచన చేయడం మంచిది. వాయిదాపడిన మొక్కులను తీర్చుకుంటారు.

కన్య: కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. మంచికిపోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో కలిసి గృహంలో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభం కలిగిస్తాయి. తెలివిగా వ్యవహరించి పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానవిద్యా ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. రాజకీయ రంగాల వారికి పర్యటనలు అధికమవుతాయి.

తుల: అనవసర ప్రసంగం వల్ల అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. భాగస్వామిక వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సన్నిహితుల నుంచి వివాదాలకు సంభందించి విలువైన సమాచారం సేకరిస్తారు. ఇంటాబయటా నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దూర ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం: బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్పలాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

ధనుస్సు: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. వాగ్వాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ఆదాయ మార్గాలు నిరాశ కలిగిస్తాయి. భూ సంబంధిత క్రయవిక్రయాల్లో స్వల్పలాభాలు అందుతాయి. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సంతానానికి విద్యావకాశాలు దక్కుతాయి. నూతన వ్యాపారాల లాభిస్తాయి. ​ పెంపుడు జంతువులపట్ల ఆసక్తి చూపుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి.


మకరం: ఆర్థిక లావాదేవీలు, ఆస్తి వ్యవహరాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. అక్రమ సంపాదనలపై దృష్టి సారించకపోవడమే మంచిది.

కుంభం: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలు లాభం చేకూరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఒత్తిళ్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. రుణాలను కొంతవరకు తీరుస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. నూతన వస్తులాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది.

మీనం: రిజర్వేషన్ రంగాల వారు సంతృప్తిని పొందుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. దీర్ఘకాలిక వివాదాలను పరిష్కారంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది

:: బ్రహ్మశ్రీ మహేష్ విశ్వకర్మ గురూజీ
సెల్​నం. 95020 59649
(‘సారథి’కి ప్రత్యేకం)