సారథి, ఎల్బీ నగర్: కాలనీల్లో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎంఆర్‌డీసీ చైర్మన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట, షిర్డీసాయినగర్ కాలనీల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్నల్ లైన్స్, మిగతా డ్రైనేజీ పనులకు ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. సీసీరోడ్లు, ఇతర సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వీరన్నగుట్ట, షిర్డీసాయినగర్ కాలనీలో పదిరోజుల క్రితం కరోనాతో మృతిచెందిన శ్రీనివాస్ చారి కుటుంబాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు టంగుటూరు నాగరాజు, వార్డుసభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.
- June 13, 2021
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- LB NAGAR
- mansurabad
- mla sudhireddy
- mrdc chairman
- ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- ఎల్బీనగర్
- మన్సూరాబాద్
- Comments Off on కాలనీల్లో సమస్యలకు సత్వర పరిష్కారం