చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
సారథి, చొప్పదండి: మండల పరిషత్ సమావేశాల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేవనెత్తిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం చొప్పదండి మండల జనరల్ బాడీ మీటింగ్ ఎంపీపీ చిలుక రవీందర్ అధ్యక్షతన జరిగింది. అర్హులైన అందరికీ రేషన్ కార్డు లు ఇవ్వాలని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సింగిరెడ్డి క్రిష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇంకుడు గుంతల బిల్లులు చెల్లించాలని పలువురు సభ్యులు కోరారు. అనంతరం 15వ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ పనుల ప్రతిపాదనలను ఎంపీపీ చిలుక రవీందర్ ఆమోదించారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు మాచర్ల సౌజన్య, ఎంపీడీవో ఇనుకొండ స్వరూప్, తహసీల్దార్ అంబటి రజిత, మండల ఉపాధ్యక్షురాలు మునిగల విజయలక్ష్మి, సర్పంచ్ లు అప్పిడి సౌజన్య, మామిడి లత, చిలుక లింగయ్య, పెద్దిశంకర్, గుంటి రవి, గుడిపాక సురేష్, తోట్ల గంగమల్లయ్య, కొత్తపల్లి రామకృష్ణ, కొలపురి తులసమ్మ, తాళ్లపల్లి సుజాత, బత్తుల లక్ష్మీనారాయణ, కట్టెకొల తార, గోపు మంగమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.