Breaking News

అయ్యప్పమాల వేసినందుకు పనిష్మెంట్

  • November 22, 2021
  • Top News
  • Comments Off on అయ్యప్పమాల వేసినందుకు పనిష్మెంట్
అయ్యప్ప దీక్ష పట్టినందుకు పనిష్మెంట్
  •  ఎండలో నిలబెట్టిన స్కూల్ ప్రిన్సిపాల్
  •  పాఠశాల ఎదుట బీజేపీ నాయకుల ఆందోళన

సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో అయ్యప్ప దీక్ష తీసుకున్న ఓ విద్యార్థిని పాఠశాల యాజమాన్యం ఎండలో నిలబెట్టింది, దురుసుగా ప్రవర్తించారు. సదాశివపేట  సదాశివపేట పట్టణంలోని సెయింట్ మేరీస్ పీఎస్ఎం హైస్కూల్ లో కిషోర్ 10వ తరగతి చదువుతున్నాడు. అయ్యప్ప దీక్షా నియమంలో భాగంగా విద్యార్థి కిషోర్ నల్ల రంగు దుస్తులు ధరించి సోమవారం ఉదయం 9 గంటల సమయంలో పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ విద్యార్థి కిషోర్ కు విద్యాసంస్థ ప్రతినిధులు, స్కూల్ ప్రిన్సిపాల్ క్లాస్ రూమ్ లోకి అనుమతించలేదు. పైగా 40 నిమిషాల పాటు మండుటెండలో నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. స్కూల్ డ్రెస్ తో.. వస్తేనే క్లాస్ రూంలోకి అనుమతి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయం కుటుంబసభ్యులకు, సదాశివపేట పట్టణ వాసులకు తెలిసింది. కుటుంబ సభ్యులు, అయ్యప్ప భక్తులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యరావు విద్యాసంస్థ ప్రిన్సిపాల్ ను నిలదీశారు. విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాల నిబంధనలు పాటించాల్సిందేనని పక్కాగా చెప్పారు. ప్రిన్సిపాల్ ఎంతకూ అనుమతి ఇవ్వకపోవడంతో అయ్యప్పస్వామి భక్తులు, ప్రజలు, బీజేపీ నాయకులు సెయింట్ మేరీస్ పీఎస్ఎమ్ హై స్కూల్ వద్దకు చేరుకుని ( విద్యార్థి- అయ్యప్ప భక్తుడి)ని అడ్డుకోవడం సమంజసం కాదని నిరసనలు తీవ్రంతరం చేశారు. పాఠశాల ఎదటు ఆందోళనకు దిగడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ మేరకు అయ్యప్ప స్వామి దీక్షదారులు స్కూల్ యాజమాన్యంతో చర్చల ద్వారా రాజీపడి నల్ల లుంగీ కాకుండా నల్ల ప్యాంటు, నల్ల చొక్కా ధరించి విద్యార్థి స్కూల్ కు వచ్చేలా అంగీకరించారు.  దీంతో ఇరు వర్గాలు ఆందోళన విరమించుకున్నాయి.

ఆరోపణల్లో వాస్తవం లేదు

 విద్యార్థి కిషోర్ కు క్లాస్ రూమ్ లోకి అనుమతించలేదంటూ వారి కుటుంబ సభ్యులు, అయ్యప్ప దీక్ష దారులు  చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. విద్యార్థి కిషోర్ నల్ల రంగు లుంగీ ధరించి రావడంతో లుంగీ స్థానంలో నల్ల రంగు పాయింట్ ధరించమని సూచించాము. ఎవరైనా పాఠశాల నిబంధనలు తప్పకుండా పాటించాలి.

  • ప్రిన్సిపాల్, సెయింట్ మేరీస్ పీఎస్ఎం హైస్కూల్