సారథి, రామడుగు: ప్రజా సంక్షేమమే ప్రధాన నరేంద్రమోడీ లక్ష్యమని మండల అధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా పధవి బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు గడిసిందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అదేశాల మేరకు నియోజవర్గంలోని అన్ని మండల కేంద్రాలతో పాటు వివిధ గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు, వృద్దులు, వికలాంగులకు మస్కులు, సానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తిర్మలాపూర్ ఎంపీటీసీ రవి, బీజేపీ సీనియర్ నాయకులు జిన్నారం విద్యాసాగర్, కోలాపురి రమేష్, దురుశెట్టి రమేష్, సంటి జితేందర్, మునీశ్వరి, కట్ట రవీందర్, జిట్టవేని అంజిబాబు, వడ్లూరి రాజేందర్, పోచంపల్లి నరేష్, పూరేళ్ల శ్రీకాంత్ కాడే నర్సింగం, స్వామి, అల్లావుద్దీన్, బొమ్మరవేని రాజు, మాడిశెట్టి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
- May 31, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Comments Off on ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యం