సామాజిక సారథి, వరంగల్: వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ గా పి.ప్రావీణ్య శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. విభాగాల వారీగా అధికారులతో పరిచయం చేసుకున్న ఆమె మాట్లాడుతూ.. జీడబ్ల్యూఎంసీ పరిధిలో వివిధ పథకాల కింద ఆయా విభాగాల ద్వారా కొనసాగుతున్న, పెండింగ్ లో ఉన్న, చేపట్టబోయే అభివృద్ధి పనుల సమాచారం అందుబాటులో ఉండాలని సూచించారు. కమిషనర్ గా పి.ప్రావీణ్యకు అదనపు కమిషనర్ సీహెచ్.నాగేశ్వర్, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ వో డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ సునీత, ఎక్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర రావు, పీఆర్వో ఆయూబ్ అలీ, డీఎఫ్ వో కిషోర్, సిటీ ప్లానర్ బానోతు వెంకన్న, సెక్రటరీ విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ యాదవ్, పన్నుల అధికారి శాంతికుమార్, జేఏవోలు ఉమాకాంత్, సుధాకర్, హెచ్ వో ప్రెసిల్లా, ఈఈలు శ్రీనివాసరావు, శ్రీనివాస్, రాజయ్య శుభాకాంక్షలు తెలిపారు.