సారథి, రాయికల్: కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన క్యాతం ప్రవీణ్ అనే ప్రైవేట్ టీచర్ కరోనా బారినపడి మృతి చెందాడు. ఆయనకు మూడు రోజులుగా జ్వరం రావడంతో కొవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సూచనల మేరకు హోంకారంటైన్ లో ఉండి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కావడంతో జగిత్యాలలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
- May 2, 2021
- Archive
- COVID
- private teacher
- raykal
- కరోనా
- భూపతిపూర్
- రాయికల్
- Comments Off on కరోనాతో ప్రైవేట్ టీచర్ మృతి