Breaking News

మున్సిపల్ సిబ్బందికి పీఆర్సీ వేతనం చెల్లించాలి

మున్సిపల్ సిబ్బందికి పీఆర్సీ వేతనం చెల్లించాలి

సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్​చేస్తూ బుధవారం నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మున్సిపల్ ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు శివవర్మ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రజలను కాపాడిన మున్సిపల్ సిబ్బంది కృషి మరువలేనిదని కొనియాడారు. పెంచిన వేతనాలను జూన్ నుంచి అమలు చేయాలని డిమాండ్​చేశారు. మున్సిపల్​ పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రిషన్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్​సిబ్బందికి పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సీఐటీయూ నాయకులు ఎండీ సలీం, భాస్కర్, మహమ్మద్, చంద్రనాయక్, బాలస్వామి, చంద్రయ్య, మునయ్య, చిన్నవెంకటస్వామి, రామస్వామి, రమేష్, లక్ష్మీదేవమ్మ, చంద్రకళ, చెన్నమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.