Breaking News

చెరువు పరిశీలన

చెరువు పరిశీలన


సామాజిక సారథి, రాజేంద్రనగర్ : జల్ పల్లీ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ లు ఎర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జల్ పల్లీ పెద్ద చెరువును స్థానిక ప్రజా ప్రతినిధిలతో కలసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముత్యాలమ్మ దేవాలయం నుండి మామిడిపల్లి వరకు సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ కూడా ఎర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి వెంట జల్ పల్లీ చెర్మెన్ అబ్దుల్లా సాద, వైస్ చైర్మన్ నాజ్, కమిషనర్ జి పి కుమార్, కౌన్సిలర్లు కంచే లక్ష్మి నారాయణ,పల్లపు శంకర్ తెరాస నాయకులు పాల్గొన్నారు.