సారథి, చొప్పదండి: గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ పిలుపునిచ్చారు. మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో 4వ విడత పల్లెప్రగతి గ్రామసభ ముద్దసాని చిరంజీవి సర్పంచ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పది రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ 10వ రోజు గ్రామ సభలో అభివృద్ధిని చూపించాలని గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఆదేశించారు. అనంతరం గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, స్పెషల్ ఆఫీసర్, కో ఆప్షన్ మెంబర్స్ ప్రజలు కలిసి దళితవాడలో కి వెళ్లి రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. పాడుబడిన ఇళ్లను తొలగించాలని, వంగిన స్తంభాలను తీసివేయాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ, సెక్రటరీ ప్రవళిక, వార్డు సభ్యులు చెల్లూజు అరుణ, తాటికొండ లక్ష్మి, దొంతు సారపు శైలజ, లంక గౌతమి, లంక దేవమ్మ, ముద్దసాని కుమార్, లంక సంపత్, మేకల సతీష్, కోఆప్షన్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా గ్రామైక్య సంఘం సభ్యులు మంగ, లంక కవిత, రేషన్ డీలర్లు, కారోబార్, ఉపాధి హామీ మేటీలు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- July 2, 2021
- Archive
- coppadandi pallepragathi
- చొప్పదండి
- పల్లెప్రగతి
- Comments Off on గ్రామాభివృద్ధిలో భాగస్వాములుకండి