సారథి న్యూస్, ములుగు: గ్రామపంచాయతీ పన్నులను వసూలు చేయాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదిత్య సురభి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పల్లెప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్స్ నిర్మాణం, పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పల్లె ప్రకృతి వనాలను కాపాడాలని సూచించారు. ప్రతిఒక్కరూ మొక్కలను రక్షించుకునే బాధ్యతను తీసుకోవాలని కోరారు. జనరల్ ఫండ్స్ గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. పర్యాటక కేంద్రాలలైన రామప్ప, లక్నవరంలో టూరిస్టులు వచ్చి చెత్తపడేస్తున్నారని, వాటిని క్లీన్ చేయించేందుకు చార్జీలు వసూలు చేయాలన్నారు. స్కూళ్లలో శానిటేషన్‌ను పర్యవేక్షించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
- March 9, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- LAKNAVARAM
- PANCHAYATH TAXES
- RAMAPPA TEMLE
- పంచాయతీ టాక్స్
- పల్లె ప్రకృతి వనం
- ములుగు
- రామప్ప
- లక్నవరం
- Comments Off on పంచాయతీ పన్నుల కలెక్షన్స్ పెంచాలి