Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ బోధన

ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ బోధన

సామాజిక సారథి, అచ్చంపేట: ప్రైవేట్‌ బడుల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందుతోందని డీఈవో గోవిందరాజులు అన్నారు. అచ్చంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను డీఈవో బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల భవనాన్ని, పాఠశాలలో ఉపాధ్యాయుల పని తీరును, రికార్డులను పరిశీలించారు. టెన్త్‌ ఫలితాలను మెరిట్‌ మార్కులతో సాధించేలా ప్రణాళికలను తయారు చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.