సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పాలడుగు, రెబ్బవరం, గొల్లపూడి గ్రామాల్లో వైరస్ సోకిన మిర్చి తోటలను శనివారం ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మిర్చి తోటలకు తామరపురుగు తెగులు ఆశిస్తున్నట్లు గుర్తించారు. దీని నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారిణి అపర్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్, ఏఈవోలు వెంకట్ నర్సయ్య, వాసంతి కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.