సారథి, సిద్దిపేట ప్రతినిధి: గంగిరెద్దులు, బేడ బుడిగజంగాల ఇండ్ల స్థలాలు కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె అశోక్ అధికారులను కోరారు. సోమవారం చేర్యాల తహసీల్ధార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామ శివారు రుద్రాయపల్లికి చెందిన గంగిరెద్దులు, బేడ బుడగజంగాల కులస్తులకు 1982లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సర్వే నం:740/ఏ/2లోని 2.22 ఎకరాల భూమి ఇండ్ల స్థలాలకు కేటాయించి లబ్ధిదారులకు పట్టాలిచ్చిందన్నారు. అప్పటి నుంచి నిరుపేదలు తమకు కేటాయించిన భూమిలో కొంతమంది ఇండ్లు నిర్మించుకోగా, మరికొంత మంది పూరి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారన్నారు. అకునూర్ గ్రామానికి అనుకొనున్న కాశగుడిసెల గ్రామాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసిందన్నారు. దీంతో కాశగుడిసెల సర్పంచ్ షేక్ ఫకీర్ దౌర్జన్యంగా ఆక్రమించుకుని, నివాస స్థలంలో హరితహారం నర్సరీని ఏర్పాటు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాని కోరారు. కార్యక్రమంలో బాధితులు లక్ష్మయ్య, రాములు, నర్సయ్య, యాదగిరి, నర్సయ్య, బాబు, శంకరయ్య, రవి, రాజు, ఆంజనేయులు, రామస్వామి, ముత్తిలింగం, రాజు, మల్లేశం, సారయ్య, ఖాతాలు, సాయిలు, పోషవ్వ, లక్ష్మి, స్వరూప, ఉప్పలమ్మ, రేణుక, రమ, రేణుక, లావణ్య, స్వప్న, లింగవ్వ పాల్గొన్నారు.
- April 21, 2021
- Archive
- CHERYALA
- CPI
- SIDDIPET
- గంగిరెద్దులు
- బేడ బుడగ జంగాలు
- సిద్దిపేట
- సీపీఐ
- Comments Off on ఇండ్ల స్థలాలు కబ్జా చేసిన్రు.. చర్యలు తీసుకోండి