సారథి న్యూస్, హైదరాబాద్: కొత్త సచివాలయం నిర్మాణ పనులను కె.కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనులను పరిశీలించారు. ఏజెన్సీ ప్రతినిధులు, ఇంజనీర్లతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సీఎం వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్, ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్ తదితరులు ఉన్నారు.
- January 26, 2021
- Top News
- Comments Off on కొత్త సచివాలయం పనుల పరిశీలన