- సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి
సామాజిక సారథి, సిద్దిపేట: ఆశతో కాదు..ఆశయంతో వస్తున్న అని సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన జన్మదినవేడుకల్లో మాట్లాడారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్రజాపథంలో నడిపేందుకు అనునిత్యం కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం నా కుటుంబంగా భావిస్తున్నానన్నారు. ప్రజా శ్రేయస్సు, సంక్షేమమే ధ్యేయంగా అనునిత్యం ప్రజల కోసం పాటు పడుతనని ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంజులక్క యువసేన నియోజకవర్గ ఇన్ చార్జి రవీందర్ రెడ్డి, యువకులు తదితరులు పాల్గొన్నారు.